Header Banner

మందుబాబులపై నిఘా పెంచిన ఏపీ సర్కార్..! వినియోగదారుల్లో ఆందోళన..!

  Mon May 12, 2025 14:02        Politics

ఏపీలో మద్యం అమ్మకాల పైన ఎక్సైజ్ శాఖ ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. మద్యం అమ్మకాల పెంపు .. రెవిన్యూ కోసం కొత్త ప్రణాళికలు అమలు చేస్తోంది. ఇప్పటికే రూ 99 కే క్వార్టర్ మద్యం కోసం భారీ డిమాండ్ కనిపిస్తోంది. త్వరలో బార్ల పాలసీ పైన తుది నిర్ణయం తీసుకోనుంది. ఇదే సమయంలో మద్యం అమ్మకాల విషయంలో మరో కొత్త ప్రతిపాదనతో సిద్దమైంది. ఇక నుంచి మద్యం కొనుగోలు సమయంలో ప్రతీ మందుబాబు నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని ఎక్సైజ్ శాఖ నిర్ణయించింది. ఇందు కోసం కొత్త విధానాలను అందుబాటులోకి తెస్తోంది.

ప్రభుత్వ సర్వే
ఏపీ ప్రభుత్వం మద్యం అమ్మకాల పైన సర్వే నిర్వహిస్తోంది. మద్యం అమ్మకాలతో పాటుగా నాణ్యత పైన మందుబాబుల నుంచి వారి అభిప్రాయాలను స్వీకరిస్తోంది. ఇందు కోసం నేరుగా బార్లు, మద్యం షాపుల వద్ద అభిప్రాయాలు వెల్లడించే క్యూఆర్‌ కోడ్‌లు ఏర్పాటుచేసింది. ప్రతి బార్‌, షాపులో కౌంటర్‌, తాగే ప్రదేశం, బయట గోడలపైనా 4 నుంచి 5 చోట్ల క్యూఆర్‌ కోడ్‌లను ఎక్సైజ్‌ సిబ్బంది అతికించారు. వినియోగదారులు ఎప్పుడైనా ఆ క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసి అందులో ప్రశ్నావళికి సమాధానాలు ఇవ్వడం ద్వారా అభిప్రాయాలు తెలియజేయవచ్చు. మందు బాబుల నుంచి వచ్చే ఫీడ్ బ్యాక్ కు అనుగుణంగా మార్పులు చేర్పులు చేయాలనేది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది.

ప్రశ్నలు - ఆప్షన్లు
కాగా, ఈ సర్వేలో వైన్స్‌ దుకాణాలకు 5, బార్లకు 3 ప్రశ్నలు పేర్కొంటారు. వాటి కింద అవును, కాదు అనే ఆప్షన్లు ఉంటాయి. వాటిని ఎంపిక చేసిన తర్వాత పేరు, మొబైల్‌ నంబరు, నియోజక వర్గం, జెండర్‌, పుట్టిన తేదీ సమర్పించి అభిప్రాయాలను సబ్మిట్‌ చేయాలి. ఈ సర్వేలో వచ్చే అభిప్రాయాల ఆధారంగా ఎక్సైజ్‌ శాఖ చర్యలు చేపట్టనుంది. అయితే, క్యూఆర్‌ కోడ్‌ సర్వేలో వివరాలు అడగటం సరికాదనే వాదన వినిపిస్తోంది. వినియోగదారుల వ్యక్తిగత వివరాల్లో ఫోన్‌ నంబరు తప్పనిసరిగా సమర్పించాలి. మద్యం విషయంలో చేసే సర్వేలో నియోజకవర్గంతో సహా వ్యక్తిగత విషయాలు తీసుకోవడం వల్ల భవిష్యత్తులో తమకు ఏవైనా ఇబ్బందులు ఎదురవుతాయే మోనని వినియోగదారులు భావిస్తున్నారు. దానివల్ల ఎక్కువ మంది సర్వేలో పాల్గొనకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

అనుమానాలు
ఈ సర్వేలో ప్రభుత్వం పలు ప్రశ్నల కు సమాధానం రాబట్టే ప్రయత్నం చేస్తోంది. ఎమ్మార్పీ ధరలకు విక్రయాలు.. నాణ్యత.. దుకాణ సిబ్బంది ప్రవర్తన వంటి వాటి పైన ప్రధానంగా ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారు. కాగా, మద్యంపై చేపడుతున్న సర్వే విషయంలో వినియోగదారుల నుంచి కొత్త ప్రశ్నలు వస్తున్నాయి. సాధారణంగా అంతా బాగుంటే వినియోగదారులు సర్వేలో పాల్గొనరు. ధరలు, నాణ్యత, బ్రాండ్ల లభ్యత వంటి వాటి పైన తాము ఫిర్యాదు చేయటం పైన సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. తామిచ్చే ఫీడ్ బ్యాక్ కీలకమని ప్రభుత్వం భావిస్తే.. తమ ఫిర్యాదుల పైన తీసుకుంటున్న చర్యల గురించి తమకు సమాధానం పంపాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో, ఇప్పుడు మద్యం దుకాణాల దగ్గర కొత్త హంగామా కనిపిస్తోంది.


ఇది కూడా చదవండి: వారికి శుభవార్త.. ఇంక నుండి ఆస్తి పన్ను ఉండదు! పవన్ సంచలన నిర్ణయం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీలో కొత్త రేషన్‌ కార్డు కోసం దరఖాస్తు చేస్తున్నారా! కీలక అప్‌డేట్!

 

భారత్ తో యుద్ధం చేసే సత్తా పాక్కు లేదు.. మంత్రి సంచలన వ్యాఖ్యలు!

 

మోదీ సంచలన ప్రకటన! పీఓకే పాక్ అప్పగించాల్సిందే, ఆపరేషన్ సింధూర్ ముగియలేదు!

 

చిన్న సేవింగ్ పెద్ద లాభం! రోజుకు రూ.166 కడితే చాలు రూ.8 లక్షలు 

మీ ఖాతాలోకి.. ఈ స్కీమ్‌ గురించి మీకు తెలుసా?

 

విడదల రజిని ఓవరాక్షన్.. ఎట్టకేలకు అరెస్టు! మాజీ మంత్రితోపాటు కారులో..

 

ప్రమాదంలో శ్రీశైలం ప్రాజెక్టు.. స్పిల్‌ వే వద్ద భారీ గొయ్యి - జారిపోతున్న కొండ గట్లు!

 

వీరజవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలకు ఏపీ మంత్రులు! మార్గమంతా ప్రజలు పెద్ద సంఖ్యలో..

 

చంద్రబాబు శుభవార్త.. రైతుల అకౌంట్‌లలో డబ్బులు జమ! ఆ పథకం వారందరికి అసలు వర్తించదు..

 

ఏపీకి మరో కొత్త రైల్వే లైను! ఆ రోట్లోనే.. ! వారికి పండగే పండగ!

 

విద్యార్ధుల కోసం మరో పథకం తెస్తున్న కూటమి ప్రభుత్వం..! అప్పటి నుంచే అమల్లోకి!

 

బెట్టింగ్ మాఫియాకు షాక్! ఇద్దరు బుకీలు అరెస్ట్.. మాజీ కేసులు మళ్లీ రంగంలోకి!

 

పొరపాటున వేరే రైలెక్కిన మహిళ..! ఇంతలోనే ఎంత ఘోరం..!

 

హైదరాబాద్‌ విమానాశ్రయంలో హై అలెర్ట్! డ్రోన్లకు నో పర్మిషన్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #APGovt #LiquorPolicy #ExciseSurvey #ConsumerPrivacy #LiquorShops #QRcodeSurvey #AlcoholFeedback